2020-21 బడ్జెట్‌పై తర్జనభర్జనలు

 


తగ్గనున్న రాష్ట్ర బడ్జెట్‌
* 2020-21 బడ్జెట్‌పై తర్జనభర్జనలు
*ఈసారి రూ.2 లక్షల కోట్ల లోపే!
* సంక్షేమానికే సింహభాగం
* రాష్ట్ర ఆదాయం జీతాలు, పింఛన్లకే సరి
* తగ్గనున్న రాష్ట్ర బడ్జెట్‌


అమరావతి, (నిఘా ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 2020-21 బడ్జెట్‌ స్వరూపం రూ.2 లక్షల కోట్ల లోపే ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాల కన్నా ఇది తక్కువే ఉండొచ్చని సమాచారం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు ఓటాన్‌ అకౌంట్‌కు దరిదాపుల్లోనే రూ.2,27,974.99 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఒక నెల మాత్రమే ఉండగా ఇంతవరకు సుమారు రూ.1.60లక్షల కోట్లే ఖర్చుచేశారు. 


ఆశించిన స్థాయిలో ఆదాయాలు రాకపోవడం, కేంద్రం నుంచి వస్తాయనుకున్న నిధులు అందకపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాలు, వాస్తవ స్వరూపం మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది కన్నా బడ్జెట్‌ను పెంచాలన్న ప్రతిష్ఠ కన్నా.. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ముందుకు వెళ్లాలని ఆర్థికశాఖకు ప్రభుత్వపెద్దలు నిర్దేశించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో బడ్జెట్‌ రూ.2 లక్షల కోట్లలోపే నిలిచిపోనుంది. రూ.1.80 - రూ.1.90 లక్షల కోట్ల మధ్య ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని ఆర్థికశాఖ అధికారుల్లోనే చర్చ సాగుతోంది.


*ప్రతిపాదనల దశలోనే కొన్ని మినహాయింపులు:-* బడ్జెట్‌ ప్రతిపాదన దశల్లోనే కొన్ని అంశాలు ఈ బడ్జెట్‌లో మినహాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం నుంచి రెవెన్యూ లోటు రూ.15వేల కోట్ల వరకు రావాల్సి ఉందని ప్రతి ఏడాది బడ్జెట్‌లో ఆదాయంగా చూపుతున్నారు. ఆ నిధులు రాకపోవచ్చని దాదాపు అంచనాకు రావడంతో తాజా బడ్జెట్‌ ప్రతిపాదనల్లో దాన్ని మినహాయించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ప్రతి ఏడాది కేంద్రసాయం రూపంలో పెద్ద మొత్తంలో ప్రతిపాదిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా అంచనాకు, వాస్తవానికి మధ్య పొంతన ఉండట్లేదు. దీంతో ప్రస్తుతం కేంద్రసాయం రూపంలో చూపే మొత్తాలు బాగా తగ్గొచ్చు.వివిధ కారణాలతో రాష్ట్ర సొంత ఆదాయమూ తగ్గింది. కేంద్ర ప్రాయోజిత పథకాల పేరుతో చూపే కేటాయింపులూ ఈసారి తగ్గనున్నట్లు సమాచారం. ఈ అన్నింటి నేపథ్యంలో రాబడులు తగ్గి అంచనాల్లోనూ బాగా మార్పులు రానున్నాయని సమాచారం.


*సొంత ఆదాయం జీతాలు, పింఛన్లకే సరీ..:* రాష్ట్రం నుంచి వచ్చే పన్నులు, పన్నేతర సొంత ఆదాయం దాదాపు ఏడాది మొత్తం ఉద్యోగుల జీతాలు, పింఛన్లకే సరిపోవచ్చని అంచనా. మొత్తం ఆదాయం దాదాపు రూ.70వేల కోట్ల వరకు ఉంటుందని, అది దానికే సరిపోతుందని అంటున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. టికెట్ల రూపంలోను, ఇతర మార్గాల్లో ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయం పోగా.. మరో రూ. 1100 కోట్ల వరకు జీతాలకే అదనంగా చెల్లించాల్సి వస్తోంది. విద్యావాలంటీర్ల వేతనాలు, కొత్తగా సచివాలయాల ఉద్యోగులకు చెల్లించే జీతాల ప్రభావం ప్రస్తుత ఏడాదితో పోలిస్తే కొత్త ఆర్థిక సంవత్సరంలో మరింత పెరగనుంది.


సంక్షేమానికే పెద్ద మొత్తాలు
ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటికి రూ.45వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఇది రూ.65వేల కోట్లకు చేరే అవకాశం ఉంది. ఇక ప్రతినెలా వడ్డీలు, అసలు తదితరాలు పోతే ప్రాజెక్టులు, ఇతరత్రా కీలక రంగాలకు వెచ్చించే నిధుల కోసం రుణాలపై ఆధార పడవలసి రావచ్చు. ఇప్పటికే ఆ మేరకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.


Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం