అమరావతిలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నినాదాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి ట్రంప్ పర్యటన ముగియనుంది.. ఢిల్లీ నుంచి ఆయను అమెరికాకు తిరుగు ప్రయాణం అవుతారు. ఇదిలా ఉంటే ట్రంప్ టూర్ ఎఫెక్ట్ రాజధాని అమరావతిపై పడింది. అక్కడ ఉద్యమం చేస్తున్న రైతులు వినూత్నంగా నిరసనను తెలియజేశారు. మంగళవారం ట్రంప్ ఫోటోలతో నిరసనలు తెలియజేశారు. రైతులు, మహిళలు ట్రంఫ్ ప్లకార్డులతో ప్లీజ్ ట్రంప్.. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధానిని మార్చకుండా చూడాలని కోరారు. అమెరికాకు ఒకటే రాజధాని ఉందని రైతులు, మహిళలు గుర్తు చేశారు. ఇక్కడ సీఎం జగన్ మాత్రం మూడు రాజధానులు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారన్నారు. ఈ నిరసన ద్వారా ట్రంప్‌కు తమ ఆవేదనను చెప్పుకుంటున్నాము అంటున్నారు రైతులు.




  •