జగన్ మరో 20 ఏళ్లు సీఎంగా ఉండాలి.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే

జగన్ పాలనపై ప్రశంసలు కురిపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏపీలో జగన్ మరో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని.. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలు సఫలీకృతం కావాలని ఆకాంక్ష.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంగళవారం తిరుమలకు వచ్చిన ఆయ.. శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. జగన్ కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాటలో నడుస్తున్నారని కితాబిచ్చారు.నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు సాగాలని.. ఆయన అనుకున్న ఆశయాలు, తండ్రిగారి కలలు నెరవేర్చాలని ఆకాంక్షించారు. పేదవాళ్ల కోసం పెట్టిన కార్యక్రమాలు.. నవరత్నాలు, రాజధానుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం కావాలన్నారు. జగన్ కూడా తండ్రిగారిలా మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఏపీలో జగన్ మరో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని.. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలు సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు.