బంగారం ధర దిగొచ్చింది. గత ఐదు రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన పసిడి ధర ఈరోజు భారీగా పడిపోయింది. ఒక్కసారిగా పసిడి ధర పతనమైంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి కూడా భారీగా పడిపోయింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. దీంతో భారత్‌లోనూ బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. మనం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. అందువల్ల అంతర్జాతీయ రేట్లు మన దేశంలో బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. అలాగే బంగారం ధర ఇటీవల కాలంలో భారీగా పెరుగుతూ రావడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. దీంతో కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది.భారత్‌లో ఎంసీఎక్స్ మార్కెట్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఈ రోజు ఏకంగా 2.7 శాతం పతనమైంది. రూ.1,200 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.42,371 స్థాయికి క్షీణించింది. గత ఐదు రోజుల్లో బంగారం ధర తగ్గడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇకపోతే బంగారం ధర గత ఐదు రోజుల్లో ఏకంగా 10 గ్రాములకు ఏకంగా రూ.3,000కు పైగా పరుగులు పెట్టిన విషయం తెలిసిందే. గత సెషన్‌లో బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ.43,788 మార్క్‌కు కూడా తాకింది.
శుభవార్త.. ఏకంగా రూ.1,200 పతనమైన బంగారం ధర.. వెండి ఢమాల్!
మీ కామెంట్ రాయండి